News March 17, 2025

ఒకే రోజు 46 వివాహాలకు హాజరైన ఎర్రబెల్లి

image

ఓకే రోజు 46 వివాహాలకు హాజరై ఎర్రబెల్లి దయాకర్ రావు రికార్డు సృష్టించారు. సాధారణంగా నాయకులు అంటే ఒకటి, రెండు వివాహాలకు హాజరవుతారు కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ఒక్క రోజే దేవరుప్పుల, పాలకుర్తి, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర, వర్ధన్నపేట మండలాల్లో పర్యటించి 46 నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులకు సంతోషకరమైన వైవాహిక జీవితం కోరుతూ వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలన్నారు.

Similar News

News March 17, 2025

PPM: పదో తరగతి పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం ఆర్.సి.యం. సెయింట్ పీటర్స్ (ఇ.యం) హై స్కూల్‌లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను, పరీక్షా నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.

News March 17, 2025

శ్రీ సత్యసాయి జిల్లా: ‘కౌలు చట్టాన్ని తీసుకురావాలి’ 

image

వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో కౌలు రైతుల రక్షణ, సంక్షేమం కోసం కౌలు చట్టాన్ని తీసుకురావాలని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు అడపాల వేమ నారాయణ పేర్కొన్నారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో సంఘం ప్రతినిధులతో కలిసి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కౌలు చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

News March 17, 2025

ఫస్ట్ మ్యాచ్.. RCB తుది జట్టు ఇదేనా?

image

IPL-2025 కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. మార్చి 22న జరిగే తొలి మ్యాచులో ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. అందులో ఆర్సీబీ ప్లేయింగ్ -11 ఎలా ఉంటుందో ESPNcricinfo అంచనా వేసింది.
టీమ్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ (C), లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, బెథెల్/టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్‌వుడ్, సుయాశ్.

error: Content is protected !!