News February 6, 2025

ఒక్కరోజు వ్యవధిలోనే గుండెపోటుతో తండ్రి, కొడుకు మృతి

image

ఒక్కరోజు వ్యవధిలోనే తండ్రి, కొడుకు గుండెపోటుతో మృతి మృతిచెందారు. ఈ విషాద ఘటన మండల కేంద్రం చాగలమర్రిలో జరిగింది. కోటగడ్డ వీధికి చెందిన కుమారుడు ముల్లా రబ్బాని(28) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందగా, ఆ బాధతో తండ్రి జహంగీర్ బాషా(60) నేడు గుండెపోటుకు గురై మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 4, 2025

నెల్లూరులో వరినాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్నాయ్..!

image

నెల్లూరు జిల్లాలోని వరి నాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. జిల్లాలో 11 మండలాల పరిధిలోని 71 గ్రామాల్లో 1,169 హెక్టార్లలో నాట్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 1,775 మంది రైతులు నష్ట పోయారన్నారు. భారీ వర్షాల వల్ల బోగోలు, విడవలూరు, కొడవలూరు, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, అల్లూరు, వెంకటాచలం, బుచ్చి, సంగం, మనుబోలు మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

News December 4, 2025

డెస్క్ వర్క్ చేసే వాళ్లకి ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు

image

నేడు చాలా మందిని వేధిస్తున్న సమస్య ఫ్రోజెన్ షోల్డర్. చేతిని పైకి ఎత్తినా, కాస్త వేగంగా కదిలించినా నొప్పి వస్తుంది. పడిపోవడం, దెబ్బ తగలడం లేదా ఎక్సర్‌సైజులు చేయడం వల్ల అలా జరిగిందని అనుకుంటారు. డెస్క్‌లో కూర్చుని పనిచేసే వాళ్లకు ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు ఎక్కువని సర్వేలో తేలింది. డయాబెటిస్, హైపోథైరాయిడిజం, గుండె జబ్బుల బాధితులకు ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువ. దీనిని అథెసివ్ క్యాప్సులైటిస్ అంటారు.

News December 4, 2025

మెగా పేరెంట్స్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు చురుకైన పాత్ర వహించాలని, మెగా పేరెంట్స్ మీటింగ్‌ను ప్రతీ పాఠశాలలో విజయవంతం చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి ఈ సమావేశం కీలకమని ఆమె తెలిపారు. మీటింగ్‌లో చర్చించాల్సిన ప్రధాన అంశాలు ప్రతీ విద్యార్థి విద్యా ప్రగతి, పదో తరగతి 100 రోజుల ప్రణాళిక అమలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ ఉంటుందన్నారు.