News February 6, 2025
ఒక్కరోజు వ్యవధిలోనే గుండెపోటుతో తండ్రి, కొడుకు మృతి

ఒక్కరోజు వ్యవధిలోనే తండ్రి, కొడుకు గుండెపోటుతో మృతి మృతిచెందారు. ఈ విషాద ఘటన మండల కేంద్రం చాగలమర్రిలో జరిగింది. కోటగడ్డ వీధికి చెందిన కుమారుడు ముల్లా రబ్బాని(28) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందగా, ఆ బాధతో తండ్రి జహంగీర్ బాషా(60) నేడు గుండెపోటుకు గురై మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 9, 2026
కంట్రోల్ రూమ్‌ను సద్వినియోగం చేసుకోండి: నిర్మల్ కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 3 మున్సిపాలిటీలలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎన్నికల్లో ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. నిర్మల్ మున్సిపాలిటీ 7036661070, ఖానాపూర్ మున్సిపాలిటీ 9949282528, బైంసా మున్సిపాలిటీ 8466056568 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
News February 9, 2026
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ‘ఈ-ప్యాంట్రీ’ సేవలు ప్రారంభం

రైల్వే ప్రయాణికులకు IRCTC శుభవార్త చెప్పింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి E-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో లేదా ఆ తరువాత ఆన్‌లైన్‌లో ఫుడ్, వాటర్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. జర్నీ రోజున సీటు వద్దకే భోజనం అందిస్తారు. ప్రస్తుతం 25 రైళ్లలో ఇది అమల్లోకి వచ్చింది. E-ప్యాంట్రీ సేవను తొలుత వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.
News February 9, 2026
కల్వకుర్తి: ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. చివరి రోజు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు భారీ ర్యాలీలతో హోరెత్తించారు. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. అధికారులు ఫిబ్రవరి 11న పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు.


