News October 1, 2024
ఒక్కసారైనా రక్తదానం చేశారా?

అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?
Similar News
News December 17, 2025
ఈనెల 21న పల్స్ పోలియో: జేసీ

ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి, ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3.52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా 1,600 బూత్లు, మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ఇంటింటి సర్వే, ట్రాన్సిట్ పాయింట్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
News December 17, 2025
ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయండి: జేసీ

ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అధికారులు అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకట్ నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News December 17, 2025
కర్నూలు ఎస్పీ హెచ్చరిక

జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ‘విజిబుల్ పోలీసింగ్’ను బలోపేతం చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలపై అవగాహన, రహదారి భద్రత నియమాల అమలు చేపడుతున్నారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సమస్యలు ఎదురైతే డయల్ 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలన్నారు.


