News October 1, 2024
ఒక్కసారైనా రక్తదానం చేశారా?
అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?
Similar News
News October 10, 2024
KNL: బన్నీ ఉత్సవాలకు బందోబస్తు వివరాలు ఇలా!
కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని దేవరగట్టులో దసరా పురస్కరించుకొని నిర్వహించే బన్నీ ఉత్సవ ఏర్పాట్లకు ఎస్పీ బిందు మాధవ్ పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈమేరకు పోలీస్ బందోబస్తు వివరాలను ఎస్పీ వివరించారు. DSPలు-7, CIలు-42, SIలు-54, ASI, HCలు-112, PCలు-362, హోంగార్డులు-95 మంది, స్పెషల్ పార్టీ పోలీసులు-50తో పాటుగా 3 ప్లాటూన్ల AR పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించినట్లు వెల్లడించారు.
News October 9, 2024
పతకాలు సాధించిన క్రీడాకారులకు కలెక్టర్ అభినందన
రాజమండ్రిలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన కర్నూలు జిల్లా క్రీడాకారులను కలెక్టర్ రంజిత్ బాషా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, అథ్లెటిక్స్ కోచ్ కాశీ రావు పాల్గొన్నారు.
News October 9, 2024
బన్ని ఉత్సవాలకు పోలీసు బందోబస్తు: ఎస్పీ
12న జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలకు 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఏడుగురు డీఎస్పీలు, 42 మంది సీఐలు, 54 మంది ఎస్సైలు, 112 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 362 మంది కానిస్టేబుళ్లు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 3 ప్లటూన్ల ఏఆర్ పోలీసులు, 95 మంది హోంగార్డులు విధుల్లో ఉంటారన్నారు.