News October 3, 2024
ఒక్క క్లిక్‌తో.. భూ వివరాలు మన చేతుల్లో

నల్గొండ, భువనగిరితో పాటు HYD, RR, MDCL, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు HMDA 2031 మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ సహా, ఈ 7 జిల్లాల పరిధిలోని భూ వివరాలను ఒక్క క్లిక్‌తో ప్రజలు చూసుకునేందుకు ప్రత్యేక యాప్ రానుంది. ఇందులోనే చెరువుల FTL, బఫర్ జోన్ వివరాలు సైతం ఉంటాయి. భవన అనుమతులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News December 11, 2025
BREAKING.. ఎల్లమ్మగూడెం సర్పంచ్‌గా వాణి సందీప్ రెడ్డి

తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన ఊట్కూరి వాణి సందీప్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన మామిడి నాగలక్ష్మిపై 459 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఘన విజయంతో సర్పంచ్ మద్దతుదారులు గ్రామంలో బాణసంచా కాల్చి, డప్పుల మోతతో సంబరాలు నిర్వహించారు.
News December 11, 2025
నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

అంతయ్యగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన కన్నెబోయిన లక్ష్మయ్య విజయం సాధించారు. ఆయన తన సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి బ్రహ్మచారిపై 21 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ మద్దతుదారులు బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు.
News December 11, 2025
MGU పీజీ సెమిస్టర్-3 పరీక్షల టైం టేబుల్ విడుదల

MGU పరిధిలో నిర్వహించనున్న పీజీ (MA, M.Com, M.Sc, M.S.W) సెమిస్టర్-3 రెగ్యులర్ పరీక్షల టైం టేబుల్‌ను డా.ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల జనవరి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత టైం టేబుల్‌ను విద్యార్థులు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో చూసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ తేదీలను గమనించాలని కోరారు.


