News October 3, 2024

ఒక్క క్లిక్‌తో.. భూ వివరాలు మన చేతుల్లో

image

నల్గొండ, భువనగిరితో పాటు HYD, RR, MDCL, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు HMDA 2031 మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ సహా, ఈ 7 జిల్లాల పరిధిలోని భూ వివరాలను ఒక్క క్లిక్‌తో ప్రజలు చూసుకునేందుకు ప్రత్యేక యాప్ రానుంది. ఇందులోనే చెరువుల FTL, బఫర్ జోన్ వివరాలు సైతం ఉంటాయి. భవన అనుమతులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News November 4, 2024

మిర్యాలగూడలో బయటపడిన పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం

image

మిర్యాలగూడ సీతారాంపురం కాలనీ రామాలయం వీధిలో ఓ వ్యక్తి గొయ్యి తవ్వుతుండగా ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. విగ్రహానికి కాలనీవాసులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. అక్కడ గుడి నిర్మించాలని కాలనీవాసులు భావిస్తున్నారు. విగ్రహాన్ని చూడడానికి స్థానికులు బారులు తీరారు. 

News November 3, 2024

యాదాద్రి: కుటుంబ సర్వే వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి: కలెక్టర్

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్ హనుమంతు రావు అన్నారు. ఇంటింటా సమగ్ర సర్వే ఈనెల 6న ప్రారంభం, 15రోజుల్లో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 2,47,354 ఇళ్లు.. 1938 మంది ఎన్యుమరేటర్లు నియామకమయ్యారన్నారు. పీఎస్‌ల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లతో సర్వే చేస్తున్నామన్నారు. సర్వే పూర్తయిన ప్రతీ ఇంటికి స్టిక్కర్‌ వేయాలన్నారు.

News November 3, 2024

వచ్చే ఏడాది మే నాటికి 4,000 మెగావాట్లు గ్రిడ్‌కు అనుసంధానం: Dy.CM

image

యాదాద్రి పవర్ స్టేషన్‌ను వచ్చే ఏడాది మే నాటికి పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో మంత్రుల బృందం ఆదివారం పర్యటించింది. యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్లో విద్యుత్తు ఉత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానం చేసే కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు.