News December 23, 2024

ఒక్క గ్యారెంటీ అమలు చేయని కాంగ్రెస్: హరీశ్ రావు

image

బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో రూ. 4లక్షల 17వేల కోట్ల అప్పుచేస్తే.. రేవంత్ రెడ్డి కేవలం ఏడాది కాలంలో రూ. 1లక్షా 27వేల కోట్ల అప్పులు చేశారని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సోమవారం మెదక్ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బడా కాంట్రాక్టర్ల దగ్గర పర్సెంటేజీలు తీసుకుని డబ్బులిచ్చారని ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదని మండిపడ్డారు.

Similar News

News September 16, 2025

మెదక్: ‘బాల్యం అనేది చదువుకోవడానికే’

image

బాల్యం అనేది చదువుకోవడానికి, కలలు కనడానికి, భవిష్యత్ నిర్మించుకోవడానికి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.శుభవల్లి అన్నారు. హవేలీ ఘనపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అమూల్యమైన దశ, వయస్సులోనే వివాహం జరగడం వలన బాలల ఆరోగ్యం, విద్య అన్ని దెబ్బతింటాయన్నారు. చిన్న వయస్సులో వివాహం జరపొద్దని సూచించారు.

News September 16, 2025

మెదక్: అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం

image

మెదక్ జిల్లాలో అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం కురిసింది. సోమవారం రాత్రి కుండపోత మాదిరిగా వర్షం కురవడంతో మెదక్ పట్టణం చెరువును తలపించింది. కాగా జిల్లాలో పలు చోట్ల ఉదయం 8 గంటల వరకు వర్షపాత వివరాలు.. మినుపూర్ 108 మిమీ, కొల్చారంలో 102 మిమీ, మెదక్ పట్టణంలో 71 మిమీ, లింగాయిపల్లిలో 71 మిమీ, టేక్మాల్ 59.5 మిమీ వర్షం కురిసింది.

News September 16, 2025

మాసాయిపేట: అనారోగ్యంతో విద్యార్థిని మృతి

image

మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని భవాని అనారోగ్యంతో మృతి చెందింది. అనారోగ్యం కారణంగా ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో ఆమె చనిపోయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న భవాని సాఫ్ట్‌బాల్ క్రీడలో చురుకుగా ఉండేది. ఆమె మృతి పట్ల ఉపాధ్యాయులు, స్నేహితులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.