News February 27, 2026
ఒక్క ఫేక్ కేసుతో అధికారం పోయింది!

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీ వల్ల ఖజానాకు ₹2వేల కోట్ల నష్టం వాటిల్లిందనేది ఆరోపణ. ఈ కేసుపై CBI ఎంట్రీ ఇచ్చి అప్పటి CM కేజ్రీవాల్, Dy.CM సిసోడియాలను అరెస్టు చేసింది. కేజ్రీవాల్ 153 రోజులు, సిసోడియా 530 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. దీంతో వారు పదవులనూ కోల్పోయారు. విపక్షాల ప్రచారంతో గతేడాది ఆప్ అధికారం కోల్పోయింది. ఇవాళ ఆ కేసంతా ఉత్తిదేనని కోర్టు <<19251338>>తీర్పునిచ్చింది.<<>>
Similar News
News April 13, 2026
అన్నదాతకు ‘ఉల్లి’పోటు.. భారీగా పడిపోయిన ధర

TG: ఉల్లి ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. సంగారెడ్డి(D) సదాశివపేట మార్కెట్‌లో గతేడాది APRలో రూ.2,300 పలికిన క్వింటాల్ ఉల్లి తాజాగా రూ.504కు పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. JAN-MAY మధ్య భారీగా దిగుబడి వస్తుంది. దీంతో ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వ్యాపారులు రూ.100కు 5-8 కిలోల వరకు ఉల్లి విక్రయిస్తున్నారు.
News April 13, 2026
సెన్సస్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్, జైలు శిక్ష

AP: సెన్సస్-2027లో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంటుంది. మే 1 నుంచి క్షేత్రస్థాయి గణన ప్రారంభం కానుంది. అధికారులు జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇళ్ల యజమానులు అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. ‘వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే రూల్ అధికారులకూ వర్తిస్తుంది’ అని పేర్కొంది.
News April 13, 2026
ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తాం: అమెరికా

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే, వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తామని US సైన్యం ప్రకటించింది. ‘ఏప్రిల్ 13న 10AM(US టైం ప్రకారం)కు ఇది మొదలవుతుంది. ఇరాన్ పోర్టులు, దాని తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని దేశాల నౌకలకు వర్తిస్తుంది. ఇరానేతర ఓడరేవులకు వెళ్లే, హార్ముజ్ జలసంధి గుండా వచ్చే ఇతర నౌకలకు ఆటంకం కలిగించబోం’ అని ట్వీట్ చేసింది.


