News February 6, 2025

ఒక్క మెసేజ్‌తో స్పందించిన కోనసీమ కలెక్టర్

image

ఐ.పోలవరం మండలం జి.మూలపాలెం జడ్పీ స్కూలుకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి 95 మంది విద్యార్థులు వస్తుంటారు. రోజూ పడవ ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరి అవస్థలను HM జనార్ధనరావు వాట్సాప్ ద్వారా డీఈవో బాషాకు మెసేజ్ చేశారు. విద్యార్థులకు లైఫ్ జాకెట్లు కావాలని కోరారు. కలెక్టర్ మహేశ్ కుమార్‌తో డీఈవో మాట్లాడారు. 3 రోజుల్లోనే 95 మందికి లైఫ్ జాకెట్లు సమకూర్చారు.

Similar News

News December 3, 2025

తుఫాన్.. బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో బాపట్ల జిల్లాకు వాతావరణ శాఖ బుధవారం ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయం ఎల్లో అలర్ట్ తెలిపే ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. దీని ప్రభావంతో రానున్న 3గంటల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్యాలయం పేర్కొంది.

News December 3, 2025

నర్సంపేటకు వరాల జల్లు..!

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ఈ నెల 5న నర్సంపేట పర్యటనకు రానున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆహ్వానం మేరకు సీఎం ఈ పర్యటనలో పాల్గొని దాదాపు రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.150 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.45 కోట్లతో నర్సింగ్ కాలేజీ, రూ.20 కోట్లతో సైడ్ డ్రైనేజీలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

News December 3, 2025

మరో మైలురాయికి చేరువలో రోహిత్ శర్మ

image

టీమ్‌‌‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. మరో 41 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల పరుగులు చేసిన 4వ భారత బ్యాటర్‌గా అవతరించనున్నారు. 503 మ్యాచ్‌లలో 42.46 సగటు, 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో 19,959 పరుగులు చేశారు. సచిన్ 34,357, కోహ్లీ 27,808, ద్రవిడ్ 24,064 రన్స్‌తో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. కాగా సౌతాఫ్రికా, భారత్ మధ్య నేడు 2వ వన్డే జరగనుంది.