News August 27, 2024
ఒక న్యూస్ చదివాను.. చాలా బాధేసింది: వాసు

ఒక న్యూస్ చదివాను, చాలా బాధేసింది అంటూ TDP పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి(వాసు) ‘X’లో పోస్ట్ చేశారు. ‘తునిలో గంజాయి మత్తులో ఒక యువకుడు రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. అయ్యా జగన్ నువ్వు ఏదో ఉద్ధరిస్తావని నీకు సీఎంగా ఈ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇస్తే, నువ్వు రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచినావు.’ అని పేర్కొన్నారు. కడప ప్రజలకు గంజాయి మహమ్మారి నుంచి విముక్తి కలిగేలా ఆయన కృషి చేస్తారనన్నారు.
Similar News
News December 5, 2025
కడపలో ఆచూకీ లేని 51వేల రేషన్ కార్డుదారులు..!

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732, బద్వేల్లో 12,223, జమ్మలమడుగులో 18,906, పులివెందుల డివిజన్లో 5,100 కార్డులు మిగిలిపోయాయి. కార్డుల్లో ఉన్న అడ్రస్సుల్లో లబ్ధిదారులు లేకపోవడంతో వాటిని అధికారులు పంపిణీ చేయలేదు.
News December 5, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00
News December 5, 2025
కడప రిమ్స్ సేవలు నిరాశపరుస్తున్నాయి!

కడప రిమ్స్ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?’ అంటూ Way2Newsలో పబ్లిష్ అయిన <<18460527>>వార్తకు<<>> భారీ స్పందన లభించింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, రెఫరెన్స్తో సేవలు త్వరగా అందుతాయని, కొన్ని సేవలకు లంచం ఇవ్వాలని, కొందరు వైద్యులు, నర్సులు కఠినంగా మాట్లాడతారని కామెంట్ల రూపంలో ఎండగట్టారు. ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులో సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.


