News December 27, 2024
ఒక సీసీ కెమెరా 20 మంది పోలీసులతో సమానం: ఎస్పీ
ఒక సీసీ కెమెరా 20 మంది పోలీసులతో సమానమని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయనగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, జిల్లాలో ఇప్పటికీ 620 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 38 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Similar News
News January 16, 2025
ఇంటికి వచ్చిన అల్లుడికి 200 రకాల వంటకాలతో భోజనం!
పెళ్లి తర్వాత సంక్రాంతి పండుగకు అత్తవారింటికి వచ్చిన అల్లుడికి 200 వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన తోట వెంకటేశ్వరరావు, ఉమా దంపతులు ఉద్యోగరీత్యా విజయనగరంలోని చినతాడివాడలో నివాసం ఉంటున్నారు. గోదావరి సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో తమ అల్లుడు, కూతురైన సంతోశ్ పృథ్వి, ధరణిలను తమ ఇంటికి పిలిచి 200 రకాలకు పైగా చేసిన వివిధరకాల పదార్థాలను కొసరి కొసరి వడ్డించారు.
News January 14, 2025
సాలూరు: రోడ్డు ప్రమాదం.. యువకుడి స్పాట్ డెడ్
దుగ్గేరు నుంచి సాలూరు వస్తున్న సాలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని సాలూరు పట్టణానికి చెందిన బలగ శ్యామ్ (19) మృతి చెందాడు. దుగ్గేరు నుంచి సాలూరు వస్తున్న బస్సుకు చంద్రమ్మపేట సమీపాన ద్విచక్రవాహనంతో ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ బస్సుకిందలకు పోయి నుజ్జునుజ్జు అయింది. సాలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 14, 2025
బొండపల్లిలో లారీ బీభత్సం.. ఇద్దరు స్పాట్‌డెడ్
బొండపల్లి మండలంలోని గొట్లాం సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు స్పాట్లోనే మృతి చెందారు. మృతి చెందిన వారిలో బొండపల్లి మండలం చందకపేటకు చెందిన లవణ్ కుమార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరొకరిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.