News June 7, 2024
ఒడిశాలో బీజేపీ.. కొఠియా, జంఝావతి సమస్య కొలిక్కి వచ్చేనా..!

కేంద్రంలో TDP కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న తరుణంలో కొఠియా, జంఘావతి సమస్యలు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు ఒడిశాలో BJP ప్రభుత్వం కొలువుతీరనున్న నేపథ్యంలో జిల్లా ప్రజాప్రతినిధులు ఈ సమస్యలపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. ఒడిశాలో పలు గ్రామాలతో పాటు కొంత భూభాగం ముంపునకు గురవ్వడంతో రబ్బరు డ్యాం నిర్మించాల్సి వచ్చింది. కొఠియా ప్రజల అభీష్టం మేరకు వారితో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Similar News
News September 18, 2025
సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకూడదు: VZM కలెక్టర్

శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని, పండగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. పండగ ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. VIP దర్శనాలు వలన సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకూడదన్నారు.
News September 18, 2025
పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 17, 2025
ఈనెల 19న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్: కలెక్టర్

ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్‌లో ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు. ప్రతి 3వ శుక్రవారం కార్యక్రమం జరుగుతుందన్నారు.