News January 4, 2025
ఒడిశా గవర్నర్గా ప్రకాశం జిల్లా వాసి

ఒడిశా గవర్నర్గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లా వాసే. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం ఈయన స్వగ్రామం. మిజోరం గవర్నర్గా ఉన్న ఈయనను ఒడిశాకు బదిలీ చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్భవన్లో హరిబాబుతో శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా CMమోహన్ చరణ్ మాఝీ హాజరయ్యారు. ఆయన ఉన్నత చదువుల కోసం వైజాగ్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.
Similar News
News December 1, 2025
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రిమ్స్ హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రిమ్స్ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. హాస్టల్ ప్రాంగణం శుభ్రంగా ఉండే విధంగా చూడాలని సూచించారు.
News December 1, 2025
ప్రకాశం: DSPని ఆశ్రయించిన ప్రేమ జంట

జలదంకి(M) లింగరాజు అగ్రహారానికి చెందిన అన్నం కార్తిక్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం(M) మున్నూరుకు చెందిన సూరగం ప్రసన్న ప్రేమించుకున్నారు. వీరు ఇద్దరు మేజర్లు కావటంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా కావలి పీజీ సెంటర్ వద్ద ఉన్న శ్రీమాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో కావలి డీఎస్పీని ఆదివారం కలిసి రక్షణ కల్పించాలని కోరారు.
News December 1, 2025
అధ్యక్షా.. రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయండి!

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన నడికుడి – కాళహస్తి రైల్వే లైన్, ఎప్పటి నుండో వేచి ఉన్న గిద్దలూరు రైల్వే గేటు బ్రిడ్జి, ఇతర రైల్వే అభివృద్ధి పనులు, పొగాకు రైతుల సమస్యలపై, అల్లూరు వద్ద ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్ట్, పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు. మరి MP ఏం ప్రస్తావిస్తారో చూడాల్సి ఉంది.


