News July 15, 2024

ఒడిశా వ్యర్థాలు.. సిక్కోలు ప్రజలకు శాపాలు!

image

ఒడిశాలోని పర్లాఖెముండి జిల్లా కేంద్రానికి సమీపంలో పాతపట్నం, కె.గోపాలపురం, హెచ్‌.గోపాలపురం ఉన్నాయి. పర్లాఖెముండికి పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ప్లాస్టిక్‌, ఆసుపత్రిలోని వస్తువులు శివారులోని కాలువలోకి వెళ్లేలా అనుసంధానం చేశారు. వారి సరిహద్దు వరకు కాలువలను చేసి గోపాలపురం వరకు వదులుతున్నారు. ఈ సమస్య కొన్నేళ్లుగా ఉండటంతో ఇరురాష్ట్రాల సరిహద్దు వద్ద అడ్డుగోడ నిర్మించారు. అయినా పరిస్థితి మారలేదు.

Similar News

News December 7, 2025

SKLM: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.

News December 7, 2025

విశాఖలో శ్రీకాకుళం మహిళ హత్య

image

శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవిని పెందుర్తి సుజాతనగర్‌లోని ఆమె సహజీవన భాగస్వామి శ్రీనివాస్ కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం జరగగా, హత్య చేసి శ్రీనివాస్ పరారయ్యాడు. నిందితుడు ఇటీవల రైస్ పుల్లింగ్ కేసులో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 7, 2025

NMMS పరీక్షకు 5516 మంది హాజరు: DEO

image

శ్రీకాకుళం జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన జాతీయ ఉపకార వేతన ప్రతిభ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 25 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 5,617 మంది విద్యార్థులకు గాను 5,516 మంది హాజరు కాగా, 101 మంది గైర్హాజరయ్యారని DEO కే.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.