News March 16, 2025
ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయండి: గొట్టిపాటి

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం శుభాకాంక్షలు చెప్పారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు పదవ తరగతి అన్నారు. ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..!

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <
News November 25, 2025
ములుగు: మండలాల వారీగా వడ్డీ లేని రుణాల పంపిణీ ఇలా..!

రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ములుగు జిల్లాలో రూ.2.7కోట్లను మహిళా పొదుపు సంఘాలకు ఈరోజు అందజేసింది. ఏటూరునాగారంలో రూ.21.89లక్షలు, గోవిందరావుపేటలో రూ.28.46లక్షలు, కన్నాయిగూడెంలో రూ.3.58లక్షలు, మంగపేటలో రూ.49.74, ములుగులో రూ.59.65లక్షలు, తాడ్వాయిలో రూ.5.19 వెంకటాపూర్లో రూ.21.84లక్షలు, వాజేడులో రూ.2.81లక్షలు, వెంకటాపురంలో రూ.13.84 లక్షల రుణాలు ఇచ్చారు.


