News October 27, 2024

ఒమన్‌లో ఒడ్డెలింగాపూర్ వాసి మృతి

image

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన పాలకుర్తి అశోక్ (39) ఒమాన్ దేశంలో గుండె పోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. అశోక్ ఏడాది క్రితం ఉపాధి నిమిత్తం ఒమాన్ దేశం వెళ్లారు. శనివారం కంపెనీలో పని చేస్తుండగా గుండె పోటు రావడంతో తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహం స్వగ్రామానికి పంపించాలని బంధువులు కోరుతున్నారు.

Similar News

News November 3, 2024

రవాణాకు ఇబ్బందులు లేకుండా వాహనాలు సమకూర్చాలి: పెద్దపల్లి కలెక్టర్

image

ధాన్యం రవాణాకు ఇబ్బందులు లేకుండా అవసరమైన వాహనాలు సమకూర్చాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం రవాణా కోసం అవసరమైన వాహనాలను సమకూర్చాలని సంబంధిత అధికారు, ఏజెన్సీలను ఆదేశించారు.

News November 3, 2024

కరీంనగర్: ‘అవకాశం వస్తే మళ్లీ పోటీ చేస్తాం’

image

తెలంగాణ రాష్ట్రంలో మరి కొన్ని రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డిసెంబర్ చివరిలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరు మాజీ సర్పంచ్‌లు తమకు అవకాశం వస్తే తప్పకుండ మళ్లీ పోటీ చేస్తామని అంటున్నారు.

News November 3, 2024

KNR: జిల్లా వ్యాప్తంగా 340 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం: కలెక్టర్

image

జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 27పై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించామన్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 340 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.