News February 3, 2025
ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 19, 2025
వైఎస్ జగన్‌ని కలిసిన కొడాలి, పేర్ని, వల్లభనేని

మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, తదితర అంశాలు గురించి జగన్ వారితో చర్చించారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నారా.? అనేది ఈ భేటీకి ప్రాధాన్యత సతరించుకుంది.
News November 19, 2025
HYD: ప్రజాభవన్‌లో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఈరోజు నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను రూపుమాపేలా నిపుణులు, మేధావులు, అధికారుల సలహాలు తీసుకుంటామని చెప్పారు.