News July 26, 2024
ఒలింపిక్స్‌లో విశాఖ క్రీడా ‘జ్యోతి’

సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డురాదని యర్రాజీ జ్యోతి నిరూపించారు. పేదరికాన్ని పక్కకు నెట్టి పారిస్ ఒలింపిక్స్‌లో 100మీ హర్డిల్స్‌లో పోటీ పడుతున్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించారు. 100 మీ. హర్డిల్స్‌లో దేశంలోనే ఫాస్టెస్ట్ ఉమెన్ అథ్లెట్‌గా గుర్తింపు సాధించారు. 40 ఏళ్ల తర్వాత విశాఖ నుంచి ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మన జ్యోతి.. ‘స్వర్ణ జ్యోతి’గా తిరిగి రావాలని ఆశిద్దాం.
Similar News
News October 14, 2025
విశాఖ: ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్

ముగ్గురు సైబర్ నేరగాళ్లను విశాఖ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలేనికి చెందిన వ్యక్తికి టెలిగ్రామ్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్ పేరిట మెసెజ్ చేశారు. వివిధ కంపెనీల పేరిట రూ.15.51 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. టెలిగ్రామ్ గ్రూపు IP లాగ్స్ ద్వారా నంద్యాలకి చెందిన షేక్ షరీఫ్ రెహమాన్, అబ్ధుల్ రెహమాన్, హుస్సేన్ వలిని పట్టుకున్నారు.
News October 14, 2025
సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహాల కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్‌కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.
News October 14, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 120 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్లో సోమవారం 120 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.