News July 29, 2024

ఒలింపిక్స్ క్రీడాకారులకు అశోక్ గజపతిరాజు శుభాకాంక్షలు

image

ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇండియా క్రీడాకారులకు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒలింపిక్‌ క్రీడాకారులకు మద్దతుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తీసుకొచ్చిన చీర్‌ ఫర్‌ భారత్‌ సెల్ఫీపాయింట్‌ను ఆదివారం స్థానిక అశోక్‌ బంగ్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Similar News

News November 17, 2025

VZM: మహిళపై హత్యాయత్నం..నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష

image

ఓ మహిళపై రాయితో దాడి చేసి, డబ్బులు దోచుకున్న కేసులో నిందితుడికి 6 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు నేడు తీర్పు వెల్లడించింది. SP దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం బొగ్గులదిబ్బలోని మహిళపై ఫూల్‌బాగ్ కాలనీకి చెందిన అమర్నాథ్ హత్యాయత్నం చేసి, నగదు దోచుకొని పారిపోయాడు. దీనిపై 1వ పట్టణ PSలో 2024లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్షను ఖరారు చేసింది.

VZM: ‘నవంబర్ 30లోగా గృహాల సర్వే పూర్తి చేయాలి’

image

గృహాల కోసం దరఖాస్తులు చేసిన లబ్ధిదారులపై జరుగుతున్న సర్వేను నవంబర్ 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సోమవారం ఆదేశించారు. ప్రభుత్వం గడువు నిర్ణయించినందున, ప్రతి అర్హత గల దరఖాస్తుదారుని వివరాలు సమగ్రంగా పరిశీలించి, ఎంపీడీవోలు యాప్‌లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సర్వేలో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.