News July 25, 2024

ఒలింపిక్స్ విజేతలకు ఏ దేశం ఎంతిస్తుందంటే?2/2

image

✮భారత్: బంగారు పతక విజేతకు రూ.75 లక్షలు, రజత పతకం రూ.50 లక్షలు, కాంస్య పతకం రూ.10 లక్షలిస్తుంది. గోల్డ్ మెడల్ విన్నర్‌కు IOA లక్షా 20 వేల డాలర్లు ఇస్తుంది
✮సింగపూర్: గోల్డ్ మెడల్‌ విజేతకు 7,44,000 డాలర్లు, సిల్వర్ మెడల్: $3,72,000, కాంస్య పతకం $186000
✮సౌదీ అరేబియా 2021 రజత పతక విజేతకు 1.33మిలియన్ డాలర్లు ఇచ్చింది
✮రష్యా: 45,300 డాలర్ల ప్రైజ్ మనీ.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News September 16, 2025

రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా ‘మిరాయ్’

image

తేజా సజ్జ నటించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.91.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మొదటి 3 రోజుల్లో రూ.81.2 కోట్లు, నిన్న రూ.10.25 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.

News September 16, 2025

మెనోపాజ్‌లో ఈ ఆహారం తీసుకుంటే మేలు!

image

ప్రతి మహిళకు మెనోపాజ్ దశ తప్పనిసరి. 40 ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్ల మార్పుల కారణంగా అనేక మార్పులొస్తాయి. అలసట, బరువు పెరగడం, హెయిర్‌లాస్ మొదలవుతాయి. కాబట్టి విటమిన్ డీ, కే, కాల్షియం, ఫాస్ఫరస్ ఉండే ఫుడ్స్, ప్రొటీన్ కోసం చికెన్, గుడ్లు, చేపలు తినాలి. వీటితో పాటు గోధుమ, బ్రౌన్ రైస్, బార్లీ, ఓట్స్, క్వినోవా, పండ్లు, ఆకుకూరలు, ఈస్ట్రోజన్ పెరగడానికి నువ్వులు, అవిసెలు, బీన్స్ డైట్లో‌ చేర్చుకోవాలి.

News September 16, 2025

16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధం

image

డ్రగ్ ట్రాఫికింగ్ కేసుల్లో పట్టుబడిన 16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. వారిని స్వదేశాలకు పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) సమర్పించిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే రాష్ట్రాల వారీగా డ్రగ్ ట్రాఫికర్స్ జాబితా సిద్ధం చేసి కేంద్ర హోం శాఖకు పంపినట్లు వెల్లడించాయి.