News November 14, 2024
ఓంకారం: ఆకలి తీర్చేందుకు వెళ్లి అనంత లోకాలకు
ఓంకారం వద్ద ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు భక్తుల ఆకలి తీర్చేందుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏ కోడూరుకు చెందిన మాజీ సర్పంచ్ చెన్నారెడ్డి, బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అన్నదానం నిమిత్తం బియ్యం, సామాగ్రిని ఆలయం వద్ద దించి వస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఇద్దరు మృతి చెందగా, చిన్నన్న, శేషన్న గాయపడ్డారని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు.
Similar News
News December 5, 2024
కర్నూలులో 4 మి.మీ వర్షపాతం
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కర్నూలు జిల్లాలో నిన్న వర్షాలు కొనసాగాయి. 11 మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా కర్నూలులో 4 మి.మీ, అత్యల్పంగా మంత్రాలయంలో 1 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
News December 5, 2024
మహిళల, బాలబాలికల భద్రత, రక్షణకు సమన్వయంతో పనిచేయాలి: ఎస్పీ
మహిళల భద్రత, రక్షణకు, బాల్యదశను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పని చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలులోని వివిధ శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే కరపత్రాలను ఆవిష్కరించారు.
News December 4, 2024
‘పుష్ప-2’ విడుదల.. శిల్పా రవి ఆసక్తికర ట్వీట్
తన స్నేహితుడు అల్లు అర్జున్ ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా నంద్యాల YCP మాజీ MLA శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ కదా?.. వైల్డ్ ఫైర్’ అని అర్థం వచ్చేలా ఎమోజీలతో ట్వీట్ చేశారు. శిల్పా రవి ఈ రాత్రికే ఈ మూవీని వీక్షించనున్నట్లు సమాచారం. మరోవైపు జిల్లాలోని థియేటర్ల వద్ద ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సందడి నెలకొంది.