News November 26, 2024

ఓంకారం క్షేత్రానికి వెళ్తూ మహిళ దుర్మరణం

image

నంద్యాల జిల్లా నరసాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీలచ్చమ్మ (36) మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. సోమవారం ఓంకారం క్షేత్రానికి వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆమె కిందపడ్డారు. ఈ ఘటనలో లచ్చమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కోడలు ఏసమ్మక తీవ్రంగా గాయపడింది. ఏఎస్ఐ రాంభూపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Similar News

News December 13, 2024

సకాలంలో పన్నులు వసూలు చేయాలి: కేఎంసీ కమిషనర్

image

నగరపాలక సంస్థకు సంబంధించి ఆస్తి, నీటి పన్నులను సకాలంలో వసూలు చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, అడ్మిన్లతో సమావేశం నిర్వహించారు. అందరూ సమన్వయం చేసుకొని, పన్ను బకాయిలను త్వరగా త్వరితగతిన వసూలు చేయాలని ఆదేశించారు. రోజువారీ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

News December 12, 2024

ప్ర‌జ‌లంద‌రూ సోద‌ర భావంతో జీవించాలి: మాజీ ఎంపీ టీజీ

image

కుల‌, మ‌త బేధాలు లేకుండా ప్ర‌జ‌లంద‌రూ సోద‌ర భావంతో జీవించాల‌ని మాజీ రాజ్య‌స‌భ‌ స‌భ్యులు టీజీ వెంక‌టేశ్ అన్నారు. కర్నూలులోని మౌర్య ఇన్‌లో మంత్రి టీజీ భ‌ర‌త్ ఆధ్వ‌ర్యంలో పాస్ట‌ర్‌ల‌కు ఏర్పాటు చేసిన‌ క్రిస్మ‌స్ క్యాండిల్ లైట్ స‌ర్వీస్ కార్య‌క్ర‌మంలో వెంక‌టేశ్ పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా కర్నూలు నగరం నిలుస్తోందని ఆయన అన్నారు.

News December 12, 2024

ISPL: అక్షయ్ కుమార్‌ టీమ్‌లో కర్నూలు కుర్రాడు

image

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)కు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి ఎన్నికయ్యారు. హీరో అక్షయ్ కుమార్‌కు చెందిన శ్రీనగర్ మహావీర్ టీమ్ హనుమంత్ రెడ్డిని బేస్ ప్రైజ్ రూ.3 లక్షలకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 14 వరకు ముంబైలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 6 జట్లు పాల్గొననుండగా హైదరాబాద్ టీమ్‌ను హీరో రామ్ చరణ్ కొనుగోలు చేశారు.