News July 15, 2024

ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ విస్తరణకు ప్లాన్

image

ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించినందుకు ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై నివేదిక సిద్ధం చేసి నిపుణుల కమిటీకి అందజేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలను కలిపి జీహెచ్ఎంసీ కిందికి తీసుకువస్తే నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

Similar News

News November 27, 2025

HYD: చేతిరాత బాగుంటుందా? మరెందుకు ఆలస్యం

image

మీ చేతిరాత అందంగా ఉంటుందా? నలుగురూ మీ రాతను మెచ్చుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. చేతిరాత పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైటింగ్ స్కిల్స్‌పై అవగాహన, ఆసక్తి కల్పించేందుకు చేతిరాత పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు స్టీఫెన్ తెలిపారు. పాఠశాలస్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు www.indianolympiads.comలో నమోదు చేసుకోవాలి.

News November 27, 2025

GHMCలో విలీనం.. 2 రోజుల్లో GO?

image

జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేస్తామని సర్కారు ప్రకటించడంతో సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. విలీనానికి సంబంధించి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు (GO) 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా విలీన ప్రక్రియ ముగించాలని సీఎం ఆదేశించారు.

News November 27, 2025

CUA మహా మాస్టర్ ప్లాన్‌: 27 మున్సిపాలిటీలకు కొత్త చట్టాలు!

image

GHMCకి అనుబంధంగా ఉన్న 27 మున్సిపాలిటీల కోసం కోర్ అర్బన్ ఏరియా (CUA) మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే HMDA మాస్టర్ ప్లాన్ 2050, 56 గ్రామాలకు FCDA ప్లాన్‌లు పూర్తవగా నోటిఫికేషన్ ఈ వారమే విడుదల కానుంది. ఇక CUA ప్లాన్ కోసం, ప్రత్యేకంగా జోనల్ రెగ్యులేషన్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ రూల్స్‌ను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో CMతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది.