News March 6, 2025

ఓటమి మరింత బాధ్యతను పెంచింది: నరేందర్ రెడ్డి

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్‌గా తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం మాత్రం తనదేనని, పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.

Similar News

News December 19, 2025

నల్గొండ: జనవరి నుంచి HPV టీకాలు

image

మహిళల్లో వచ్చే క్యాన్సర్లను అరికట్టాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ (HPV)ను వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. HPV టీకాలపై డీఎంహెచ్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ టీకాలను 2026 జనవరి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తామన్నారు.

News December 19, 2025

మరికల్: ఆ పల్లెకు సర్పంచ్‌లుగా నాడు తల్లి.. నేడు తనయుడు

image

మరికల్ మండలం వెంకటాపూర్‌ గ్రామ పంచాయతీలో తల్లి వారసత్వాన్ని కుమారుడు నిలబెట్టుకున్నారు. 2019లో ఈ పంచాయతీ నూతనంగా ఏర్పడగా, తొలి సర్పంచ్‌గా కళావతమ్మ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఆమె తనయుడు విజయ్ కుమార్ రెడ్డి తన ప్రత్యర్థిపై 111 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తల్లి హయాంలో జరిగిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

News December 19, 2025

రోజూ గుడ్లు పెట్టే కోళ్ల గురించి తెలుసా?

image

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరానికి 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18 నుంచి 20 వారాల పాటు పెంచిన తర్వాత గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. గోధుమ రంగులో ఉండే ఈ గుడ్లు పెద్దగా ఉంటాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు.