News August 30, 2024
ఓటరు జాబితాకు సంబంధించి మ్యాపింగ్ పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

ఓటరు జాబితాకు సంబంధించి మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, సంబంధిత ఎన్నికలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
Similar News
News October 28, 2025
ధాన్యం సేకరణపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధాన్యం సేకరణపై అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు విడతల వారీగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. దీని ద్వారా మిల్లుల వద్ద సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు. కొనుగోళ్లు సజావుగా సాగేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
News October 28, 2025
చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

NLG: చెకుముకి సైన్స్ సంబరాలు 2025 పోస్టర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పాఠశాల స్థాయిలో 8, 9 10వ తరగతుల విద్యార్థులకు సైన్స్ టెంపర్‌ని అవగాహన కల్పించేలా ప్రతి ఏటా జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహణకు సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
News October 28, 2025
కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్

నల్గొండ జిల్లాలో కన్నబిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజాతో మాట్లాడి వెంటనే పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పిల్లల అమ్మకాలపై, అక్రమ దత్తతపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.


