News September 25, 2024

ఓటరు జాబితా పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

image

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపడుతూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం కొనసాగుతున్న ప్రదేశాన్ని తెలిపేలా ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలని బీఎల్ఓలకు సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

మెదక్‌లో JOBS.. APPLY NOW

image

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్‌లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్‌లో సమర్పించాలని తెలిపారు.

News November 23, 2025

మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారానే ప్రజావాణి: కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 24న హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఎన్నికల అవగాహన సదస్సులో అధికారులు పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండాలని తెలిపారు.