News August 29, 2024
ఓటరు జాబితా రూపకల్పనకు పటిష్ట చర్యలు: పార్థసారథి
ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్త పట్నాయక్ పాల్గొన్నారు. గ్రామాలలో 18 సంవత్సరాలకు పైబడిన వారికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
Similar News
News September 12, 2024
‘రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2024కు దరఖాస్తు చేయండి’
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2024 కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం తదితర రంగాల్లో కృషి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18ఏళ్ల లోపు విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు http://awards.gov.in లో సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News September 12, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు !
❤ఉమ్మడి జిల్లా ఖోఖో సబ్ జూనియర్స్ బాల,బాలికల జట్లు ఎంపిక
❤ఆత్మకూరు: పందికి పాలు పట్టించిన ఆవు❤దేవరకద్ర: పొదల్లో నవజాత శిశువు లభ్యం❤BSC డిప్లమాలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు వాసి
❤MBNR:దొంగతనానికి వెళ్లి ఇద్దరు దుర్మరణం
❤కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:BJP
❤GDWL:Way2News ఎఫెక్ట్.. ప్రమాదకర విద్యుత్ వైర్లు తొలగింపు
❤కార్మికుల బకాయిలు చెల్లించండి:AITUC
News September 12, 2024
PDSU 50ఏళ్ల స్వర్ణోత్సవ సభ లోగో, పోస్టర్ ఆవిష్కరణ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 24న నిర్వహించే PDSU 50ఏళ్ల లోగో, స్వర్ణోత్సవ సభ పోస్టర్ ను PDSU మాజీ నేతలు బి.రాము, కాలేశ్వర్ ఆవిష్కరించారు. 1974లో PDSU ఏర్పడిన నాటి నుంచి 2024 వరకు మొక్కవోని దీక్షతో, విద్యారంగ సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేసిందని వారు తెలిపారు. ఈ సమావేశంలో కాలేశ్వర్, దేవేందర్, అరుణ్, అంబదాస్, సాంబశివుడు, సాయి, మారుతి, సీతారాం, అజయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.