News September 12, 2024

ఓటరు జాబితా..లోక్ సభ ఎన్నికలనాటికి ఇదీ పరిస్థితి!

image

1.కొడంగల్-2,41,794
2.నారాయణ పేట-2,36,182
3.మహబూబ్ నగర్-2,59,260
4.జడ్చర్ల-2,22,838
5.దేవరకద్ర-2,39,745
6.మక్తల్-2,44,173
7.షాద్నగర్-2,38,478
8.వనపర్తి-2,73,863
9.గద్వాల-2,56,637
10.అలంపూర్-2,40,063
11.నాగర్ కర్నూల్-2,36,094
12.అచ్చంపేట-2,47,729
13.కల్వకుర్తి-2,44,405
14.కొల్లాపూర్-2,39,463 మంది ఓటర్లు ఉన్నారు. అర్హులైన యువత నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా అధికారులు పిలుపునిచ్చారు.

Similar News

News October 5, 2024

నాగర్ కర్నూల్: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన

image

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినితో రికార్డ్ అసిస్టెంట్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. దీంతో విద్యార్థిని కుటుంబీకులు షీటీంను సంప్రదించారు. వారు కాలేజీకి చేరుకొని సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినితో లిఖితపూర్వక ఫిర్యాదు చేసుకున్నారు. పై అధికారులకు సమాచారం ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని షీ టీం అధికారి వెంకటయ్య తెలిపారు.

News October 5, 2024

MBNR: బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ

image

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్‌లో బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోని పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ఆవరణంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా భావిస్తున్నాను అని ఎంపీ అన్నారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలు అరుణమ్మను సన్మానించారు.

News October 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✒ఖమ్మంపై సంచలన విజయం.. ఫైనల్లోకి పాలమూరు జట్టు
✒మరో 4 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
✒12న పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి
✒రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ
✒2వ రోజు ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
✒పలుచోట్ల బతుకమ్మ సంబరాలు
✒ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్లు-23,22,054
✒సెలవులకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త:SPలు
✒DSC-2024..కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన
✒ముమ్మరంగా డిజిటల్ కార్డు సర్వే