News April 19, 2024
ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కారం

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.
Similar News
News December 7, 2025
నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

ఎస్పీ అజిత ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు 50 ప్రత్యేక బృందాలతో నాకా బంది నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా రాత్రి పూట వాహనాల తనిఖీని తీవ్రతరం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్పై 13 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ 11 కేసులు, ఓవర్ స్పీట్/రాష్ డ్రైవింగ్-8 కేసులు, 3-వాహనాలు సీజ్ చేసి, MV యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.1,81,260 జరిమానా విధించారు.
News December 7, 2025
నెల్లూరులో బస్సు డ్రైవర్పై కత్తితో దాడి

నెల్లూరులో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. బోసుబొమ్మ సెంటర్ వద్ద బస్సు డ్రైవర్, కండక్టర్పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 7, 2025
నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనును సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించాలన్నారు.


