News September 24, 2024

ఓటరు నమోదు కట్టుదిట్టంగా నిర్వహించాలి: సుదర్శన్ రెడ్డి

image

ఓటర్ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఇంటింటి సర్వేలో ఆధార్ నంబర్ సేకరణ తప్పనిసరి కాదని, ఓటర్లు ఇష్టం ఉంటే ఇవ్వవచ్చన్నారు. సెప్టెంబర్ 28 నాటికి ఇంటింటి సర్వే వంద శాంతం పూర్తి చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు తదితరులున్నారు.

Similar News

News February 24, 2026

KNR: డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

image

భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఈ నెల 27న వాహన చోదకులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణలో కంటిచూపు కీలకమని, ఆర్టీసీ, ఆటో, ఇతర వాహన డ్రైవర్లు పోలీసు ప్రధాన కార్యాలయం పక్కన గల అస్త్ర కన్వెన్షన్ హాల్‌లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News February 24, 2026

కరీంనగర్: జర్నలిస్టుల డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

image

తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ డైరీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. జర్నలిస్టుల డైరీ తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

News February 24, 2026

KNR: డిజిటల్ జూదం.. పోలీసులకు సవాల్‌!

image

కరీంనగర్ జిల్లాలో పేకాటరాయుళ్లు పంథా మార్చారు. పోలీసులకు చిక్కకుండా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా నగదు బదిలీ చేస్తూ జూదం ఆడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని తోటలు, కోళ్ల ఫారాలను అడ్డాలుగా మార్చుకొని.. బయట కాపలాదారులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గత మూడేళ్లలో 1,433 మందిని పోలీసులు పట్టుకున్నా.. తాజా సాంకేతిక పోకడలు, పక్కా నిఘా వ్యవస్థ వారికి సవాలుగా మారాయి.