News May 12, 2024
ఓటర్లకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి విజ్ఞప్తి

ఇన్ ఎడిబుల్ ఇంక్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. ఈ ఇంక్ ఎవరూ కొనుగోలు చేసేందుకు, సేకరించేందుకు అందుబాటులో లభించదని స్పష్టం చేశారు. దేశంలో కేవలం ఒక చోట మాత్రమే దీని ఉత్పత్తి జరుగుతోందని, ఎన్నికల కమిషన్ మినహా ఇతరులు ఎవరూ దీనిని పొందే అవకాశం లేదన్నారు. అపోహలకు గురికాకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News October 23, 2025
VZM: జిల్లాకు బాక్సింగ్‌లో 4 రాష్ట్ర స్థాయి మెడల్స్

రాజమండ్రిలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో విజయనగరం జిల్లా బాక్సింగ్ క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-17 కేటగిరీలో దుర్గాప్రసాద్, సచిన్.. అండర్-19 కేటగిరీలో వర్ధన్ రెడ్డి, యశ్వంత్ బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని బుధవారం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని కలెక్టర్ సూచించారు.
News October 23, 2025
అర్హులందరికీ ఇళ్లు మంజూరు: VZM కలెక్టర్

గృహాల లేఅవుట్‌లలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి అర్హులైన వారికి కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం అమరావతి నుంచి CCLA ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అందరికీ ఇళ్లు విధానంలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
News October 22, 2025
VZM: ‘గ్రామాల్లో పౌర హక్కుల దినం తప్పనిసరిగా నిర్వహించాలి’

ప్రతి నెలా గ్రామాల్లో పౌర హక్కుల దినం తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ సమావేశం నిర్వహించారు. SC, ST అత్యాచారాల నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సీ కాలనీలకు, స్మశానాలకు రహదారులు నిర్మించేందుకు ఉపాధి హామీ నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.