News May 12, 2024

ఓటర్లకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి విజ్ఞప్తి

image

ఇన్ ఎడిబుల్ ఇంక్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. ఈ ఇంక్ ఎవరూ కొనుగోలు చేసేందుకు, సేకరించేందుకు అందుబాటులో లభించదని స్పష్టం చేశారు. దేశంలో కేవలం ఒక చోట మాత్రమే దీని ఉత్పత్తి జరుగుతోందని, ఎన్నికల కమిషన్ మినహా ఇతరులు ఎవరూ దీనిని పొందే అవకాశం లేదన్నారు. అపోహలకు గురికాకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News July 5, 2025

విజయనగరం: మా భవాని ‘బంగారం’

image

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటింది. కజికిస్తాన్‌లో జరుగుతున్న
ఏసియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శనివారం పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో భవాని అద్భుత ప్రతిభ కనబర్చడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు, జిల్లా క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News July 5, 2025

VZM: ‘ఈనెల 7న పోస్టల్ సేవలు బంద్’

image

ఈనెల 7న జిల్లా వ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఐటీ 2.0 రోల్ అవుట్ కారణంగా సేవలు నిలుపుదల చేస్తున్నామన్నారు. కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్‌ను పూర్తి చేసి ఈనెల 8 నుంచి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఖాతాదారులు గమనించాలని కోరారు.

News July 5, 2025

స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఎస్పీ సమీక్ష

image

జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో సమాచార ఏర్పాటు చేసుకోవాలని SP వకుల్ జిందాల్ కోరారు. శనివారం ఆయన కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పనితీరు క్రియాశీలకమైనదని అన్నారు. ముందస్తు సమాచారం సేకరించేందుకు సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని దిశా నిర్దేశం చేశారు.