News May 10, 2024
ఓటర్లకు విశాఖ కలెక్టర్ ఆహ్వాన పత్రిక

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వినూత్నరీతిలో ప్రచారాన్ని చేపట్టారు. ఈనెల 13న ఎన్నికల పండగలో ఓటర్లు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను ముద్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ ఈ ప్రచారాన్ని చేపట్టారు.
Similar News
News November 29, 2025
వీఎంఆర్డీఏ పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు

వీఎంఆర్డీఏకు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు ప్రవేశపెడుతున్నామని చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో శనివారం బోర్డు సమావేశం జరిగింది. పర్యాటకుల సౌకర్యం కోసం ఈ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రహదారులు, 2040 మాస్టర్ ప్లాన్, కైలాసగిరిపై అభివృద్ధి ప్రాజెక్టులు గురించి సమావేశంలో చర్చించామని తెలిపారు.
News November 29, 2025
మాతృమరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్

విశాఖ కలెక్టరేట్ లో శనివారం కలెక్టర్ హరీంధిర ప్రసాద్ మాతృ మరణాలపై సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో కణితి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, నక్కవానిపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రం పరిదిలో ఒక్కొక్క మాతృ మరణం జరిగిందని DMHO జగదీశ్వర రావు వివరించారు. మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూడాలని, హైరిస్క్ గర్భిణీలు ప్రసవానికి వచ్చినప్పుడు KGHకు గాని VGHకు గాని రిఫర్ చేయాలని కలెక్టర్ సూచించారు.
News November 29, 2025
డ్రగ్ ఫ్రీ విశాఖ నినాదంతో ‘వైజాగ్ మారథాన్’

విశాఖ బీచ్ రోడ్డు వేదికగా ఆదివారం 4వ ఎడిషన్ ‘వైజాగ్ మారథాన్’ జరగనుంది. ‘డ్రగ్ ఫ్రీ విశాఖ’ నినాదంతో వైజాగ్ రన్నర్స్ ఆధ్వర్యంలో ఎంజీఎం గ్రౌండ్స్ వద్ద ఉదయం 4 గంటలకు పరుగు ప్రారంభం కానుంది. ఈసారి గిరి ప్రదక్షిణ స్ఫూర్తితో ప్రత్యేకంగా 32 కిలోమీటర్ల పరుగును చేర్చడం ప్రధాన ఆకర్షణ. వీటితో పాటు 5కే, 10కే, 21కే విభాగాల్లో సుమారు 8 వేల మంది రన్నర్లు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.


