News January 24, 2025
ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మరో వైపు ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఉదయం 9 గంటలకు మానవహారం ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి రంగనాథ్ తెలిపారు.
Similar News
News November 22, 2025
ఏలూరులో కాలువలో దూకిన మహిళ

ఏలూరు పవర్పేటకు చెందిన పూడి ఎర్రయ్య శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని అతని భార్య నారాయణమ్మ మధ్యాహ్న సమయంలో తంగెళ్లమూడి వంతెన పైనుంచి తమ్మిలేరులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను రక్షించి, చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 22, 2025
మెట్పల్లి: ‘నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి’

ముత్యంపేట్ నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని MLC అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెట్పల్లిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో చెరుకు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.500 బోనస్ చెల్లించాలన్నారు. జిల్లా BJP అధ్యక్షుడు యాదగిరి బాబు, రఘు, రమేష్, రాజేందర్ తదితరులున్నారు.
News November 22, 2025
భూపాలపల్లి: భూసేకరణపై సమీక్ష

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పంట కాలువలకు భూసేకరణ, ఎంజాయ్మెంట్ సర్వే ప్రగతిపై ఐడిఓసిలో రెవెన్యూ, ఇరిగేషన్, మెగా అధికారులతో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంట కాలువల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా సాగేందుకు, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


