News May 11, 2024
ఓటర్ స్లిప్పు రాలేదా.. ఆందోళన వద్దు
ఖమ్మం: ఈనెల 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఓటర్ స్లిప్పు రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే స్లిప్పు రాకుండా ఒక ఎస్ఎంఎస్ తో పోలింగ్ బూతులో ఓటు ఉందో లేదో సులభంగా తెలుసుకొని అవకాశం ఉంది. ఓటరు తన ఫోను నుంచి ఈ సీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ కార్డు నెంబరు నమోదు చేసి 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు మెసేజ్ పంపించాలి. వెంటనే పోలింగ్ బూత్ నెంబర్ ఓటర్ జాబితాలోని క్రమసంఖ్య వివరాలతో మెసేజ్ వస్తుంది.
Similar News
News November 20, 2024
మధిర: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వైరా ఏసీపీ
మధిర రూరల్ మండలంలోని అమరావతి కాటన్ జన్నింగ్ మిల్లు, మంజిత్ కాటన్ జన్నింగ్ మిల్లు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని, మధిర మండలం ఇల్లురూ గ్రామంలోని వైరా ఏసీపీ రహెమాన్ సందర్శించారు. దాన్యం, పత్తి కొనుగోలు పలు అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పత్తి తేమ శాతాన్ని పరిశీలించారు.
News November 20, 2024
రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి: భట్టి
బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణాల వల్లనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లను ప్రజా ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. దేశంలో ఒకే రోజు రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసి దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు.
News November 20, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు
∆}KMM: రూ.లక్ష కోట్ల వడ్డీ లేనిరుణాలు ఇస్తాం: భట్టి∆}రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని వరంగల్ అభివృద్ధి: మంత్రి పొంగులేటి ∆} మధిర:ఫైనాన్స్ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నం∆}మంత్రి పదవిపై ఎమ్మెల్యే కూనంనేనిఆసక్తికర వ్యాఖ్యలు∆} ఖమ్మం: పోలీసుల ఎదుట మావోయిస్టు లొంగుబాటు∆} వాజేడు:జాతీయ రహదారి వెంట మొక్కలు నాటిన మంత్రి సీతక్క∆}రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల