News April 28, 2024
ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి: శ్రీకాకుళం కలెక్టర్

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. శనివారం సాధారణ పరిశీలకులు శేఖర్, సందీప్ కుమార్, పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా, పోలీసు పరిశీలకులు సచింద్ర పటేల్, దిగంబర్ పి. ప్రధాన్లకు ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఇప్పటికే సిబ్బందికి రెండు విడతల శిక్షణ పూర్తి చేశామన్నారు.
Similar News
News April 20, 2026
SKLM: అత్త చితికి తలకొరివి పెట్టిన కోడలు

సరుబుజ్జిలిలోని షలంత్రి గ్రామంలో అత్త చితికి కోడలు తలకొరివి పెట్టిన ఘటన ఆదివారం జరిగింది. బత్తిని ఎర్రమ్మ (75) భర్త, ఇద్దరు కుమారులుండగా వారు ఇటీవల మృతి చెందారు. దీంతో ఎర్రమ్మ కోడలు కళావతితో నివాసం ఉండేది. కొంతకాలంగా ఎర్రమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఆదివారం ఆమె మృతి చెందగా కుమారులెవరూ లేకపోవడంతో కోడలు కళావతి అంత్యక్రియలు చేశారు.
News April 20, 2026
శ్రీకాకుళం జిల్లాలో రేపు పీజీఆర్ఎస్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.