News February 24, 2025
ఓటు వేసేలా వెసులుబాటు కల్పించాలి: కామారెడ్డి కలెక్టర్

ఈనెల 27న పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సాధారణ సెలవు ప్రకటించామని ఆయన వెల్లడించారు.
Similar News
News November 3, 2025
మేడ్చల్: ప్రజావాణిలో 105 ఫిర్యాదుల స్వీకరణ

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి డీఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్ 105 దరఖాస్తులను స్వీకరించారు.
News November 3, 2025
మేడ్చల్: నూతన రేషన్ కార్డులు.. బియ్యం పంపిణీ..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉప్పల్, నాచారం, హబ్సిగూడ సహా అనేక ప్రాంతాల్లో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన వారికి ఈనెల రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యం, సరకులు పంపిణీ చేస్తున్నట్లు డీలర్లు తెలిపారు. మీసేవ అప్లికేషన్ నంబర్ ఉపయోగించి, నెట్ సెంటర్లో మీ దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోవాలని, ఒకవేళ రేషన్ కార్డు మంజూరైతే, రేషన్ బియ్యం కోసం రావాలని సూచించారు.
News November 3, 2025
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్!

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సోమవారం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల అర్జీల పరిష్కారం అనంతరం సంబంధిత దరఖాస్తు దారుడుకి అధికారులు స్వయంగా ఫోన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించాలని, అలాగే అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తించాలన్నారు.


