News May 15, 2024
ఓటు వేస్తూ వీడియో తీసిన యువకుడిపై కేసు నమోదు
ఓటు వేస్తూ సెల్ ఫోన్‌లో వీడియో తీసి, దాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసిన యువకుడిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం జరిగిన ఎన్నికల్లో ఏదులాపురానికి చెందిన ఏపూరి తరుణ్ సెల్ ఫోన్‌తో పోలింగ్ బూత్లోకి వెళ్లి తాను ఓటు వేసిన గుర్తు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు అందగా కేసు నమోదు చేశారు.
Similar News
News November 28, 2024
పేదలందరికీ ఇళ్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం కూసుమంచిలో పర్యటించారు. గత ఎన్నికల్లో ఎంతో కష్టపడి తనను గెలిపించారని, నియోజవర్గ ప్రజలు ఆశలను వమ్ము చేయనని అన్నారు. త్వరలోనే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని.. ఇదంతా ప్రజలిచ్చిన దీవెనలు, ఆశీస్సులతోనే జరిగిందన్నారు.
News November 27, 2024
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో బుధవారం 17, అటు భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతాలతో 15,16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎముకలు కొరికే ఈ చలిలో ఉదయాన్నే బయటకు రావాలంటేనే ప్రజలు గజ గజలాడుతున్నారు. అటు వృద్ధులు, పిల్లలు పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది.
News November 27, 2024
ఖమ్మం రీజీయన్ RTCలో 116 కాంట్రాక్టు ఉద్యోగాలు
మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఖమ్మం రీజీయన్‌లో 116 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT