News January 25, 2025

ఓటు హక్కును వజ్రాయుధంలా వినియోగించుకోవాలి: MHBD కలెక్టర్

image

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వజ్రాయుధంలా వినియోగించుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.

Similar News

News November 5, 2025

ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం: వైసీపీ

image

ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైసీసీ X ఖాతాలో పేర్కొంది. మద్యం తాగించి..లైంగిక దాడికి పాల్పడినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు వైసీసీ ట్వీట్ చేసింది. ఈ ఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందనేది తెలియాల్సి ఉంది.

News November 5, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: డ్రోన్లకు పర్మిషన్ ఇవ్వండి!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో తమ పార్టీ అగ్ర నేతలు కేటీఆర్, హరీశ్ రావులు పాల్గొంటున్నారని.. వారి భద్రత దృష్ట్యా డ్రోన్లు వాడుతామని బీఆర్ఎస్ నాయకులు సీపీ సజ్జనార్‌ను కోరారు. స్థానికంగా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగిస్తామని సీపీకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించలేదని సమాచారం. మరి పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

News November 5, 2025

అసెంబ్లీ స్పీకర్ ముందుకు రేపు జగిత్యాల MLA సంజయ్

image

పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ విడతలవారీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేపటి నుంచి రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణకు స్వీకరించనున్నారు. ఈ మేరకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను గురువారం విచారించనున్నారు. ఇరువర్గాల అడ్వకేట్ల సమక్షంలో ఈ విచారణ జరగనుంది.