News January 25, 2025
ఓటు హక్కును వజ్రాయుధంలా వినియోగించుకోవాలి: MHBD కలెక్టర్

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వజ్రాయుధంలా వినియోగించుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
Similar News
News February 9, 2025
సికింద్రాబాద్: షాపింగ్ మాల్‌లో సూసైడ్ అటెంప్ట్!

సికింద్రాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్ మాల్‌లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లండ్ చెత్త రికార్డు

వన్డేల్లో ఇంగ్లండ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. 300కు పైగా స్కోర్ చేసి అత్యధిక సార్లు పరాజయం పాలైన జట్టుగా నిలిచింది. 99 మ్యాచుల్లో 28 సార్లు ఇంగ్లండ్ ఓడింది. ఆ తర్వాతి స్థానాల్లో భారత్(27), వెస్టిండీస్(23), శ్రీలంక(19) ఉన్నాయి. వన్డే WC 2023 తర్వాత ఇంగ్లండ్‌కు ఇది వరుసగా నాలుగో సిరీస్ ఓటమి.