News February 27, 2025
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్

కరీంనగర్ ముకరంపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ స్టేషన్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యూ లైన్లో వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News December 15, 2025
హుజూరాబాద్: 5 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: CP

KNR పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17న మూడో దశ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. 144 సెక్షన్ 48 గంటల పాటు వీణవంక , ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల పరిధిలో అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం లేదా సమావేశం కావడాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు.
News December 15, 2025
రామడుగు హరీష్‌కు ‘ఒక్క’ ఓటు అదృష్టం!

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామడుగు హరీష్ సంచలన విజయం సాధించారు. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన హరీష్‌పై అందరి దృష్టి పడింది. ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్కే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక ఓటుతో గెలుపొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ తెలిపారు.
News December 14, 2025
ముంజంపెల్లి: ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపు

మానకొండూర్ మండలం ముంజంపెల్లి సర్పంచ్ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది. నందగిరి కనక లక్ష్మి (INC) ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. తొలి లెక్కింపులో ఆమెకు 878 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి వెలుపు గొండ కొమురమ్మ (BRS)కు 877 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ తర్వాత కూడా కనక లక్ష్మికే 1 ఓటు ఆధిక్యం రావడంతో ఆమెను విజేతగా ప్రకటించారు.


