News February 25, 2025
ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలి: కలెక్టర్

ఈ నెల 27న నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలలో పట్టభద్రుల, ఉపాద్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.
Similar News
News November 22, 2025
AP న్యూస్ అప్డేట్స్

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.
News November 22, 2025
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నూతన అధికారుల సంఘం ఎన్నిక

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా అంజిత్ రావు, విక్రమ్ కుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి విలాస్ తెలిపారు. అసోసియేట్ అధ్యక్షుడిగా గంగాధర్, ఉపాధ్యక్షుడిగా భాస్కర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మల్లేశ్, జాయింట్ సెక్రెటరీగా వెంకటేశ్, ట్రెజరర్‌గా ప్రమోద్, చైతన్య, ఈసీ మెంబర్లుగా దిలీప్, తేజస్విని, మధుసూదన్ రావు, శరత్ ఎన్నికయ్యారన్నారు.
News November 22, 2025
NZB: ఇద్దరు SIలకు VRకు బదిలీ

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన బదిలీల్లో ఇద్దరు SIలకు VRకు బదిలీ చేసి అంతలోనే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ పేరిట మళ్లీ స్టేషన్లకు అటాచ్ చేశారు. ఇందులో భాగంగా NZBరూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ-1గా పని చేసిన మహమ్మద్ ఆరిఫ్‌ను డిచ్పల్లి పోలీస్ స్టేషన్‌కు, నవీపేట ఎస్ఐగా పనిచేస్తున్న వినయ్‌ను నిజామాబాద్ 6వ టౌన్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


