News February 25, 2025

ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలి: కలెక్టర్

image

ఈ నెల 27న నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలలో పట్టభద్రుల, ఉపాద్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

Similar News

News July 11, 2025

సంగారెడ్డి: ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఈనెల 15లోగా http://nationalawardstoteachers.educatiin.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News July 11, 2025

కృష్ణా: అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా ఇదే.!

image

అన్నదాతా సుఖీభవ-PM కిసాన్ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులు తమ ఆధార్ నంబర్‌ను మన మిత్ర వాట్సాప్‌ 9552300009కు పంపి అర్హతను తెలుసుకోవచ్చు. పేరు లేకుంటే గ్రామ రైతు సేవా కేంద్రంలో అర్జీ, పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్‌ గ్రీవెన్స్‌ మాడ్యూల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జిల్లాలో 3,44,029 రైతులు ఉండగా 1,35,881 అర్హత పొందారు.

News July 11, 2025

కరీంనగర్: రేపే చివరి అవకాశం

image

KNR జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం నుంచి MBC నిరుద్యోగులకు HYDలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రకటన విడుదలైంది. 4 రోజుల ఈ శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నేర్పుతారు. భోజన, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తారు. 21-30 ఏళ్ల మధ్య వయస్సు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 12లోపు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని BC డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు.