News June 3, 2024
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో గల సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ను ఒకే చోట నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు.
Similar News
News September 17, 2024
NZB: డిఫెన్స్ మినిస్టర్‌ను కలిసిన ఎంపీ అరవింద్
కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రంజిత్ సింగ్‌ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని డిఫెన్స్ మినిస్టర్ నివాస గృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎంపీ అరవింద్ చేసే ప్రతి కార్యక్రమాల విషయంలో డిఫెన్స్ మినిస్టర్ సలహా సూచనలను తీసుకునే నేపథ్యంలో ఆయనతో కలిసి ఫ్లవర్ బొకే అందజేసి శాలువాతో సత్కరించారు.
News September 17, 2024
కేటీఆర్‌ను కలిసిన KMR మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన జాతీయ సమైఖ్యత దినోత్సవ కార్యక్రమంలో కేటిఆర్‌ను KMR మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కేటిఆర్‌తో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు, NZB మాజీ జిల్లా ఛైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దిన్ ఉన్నారు.
News September 17, 2024
NZB: సార్వజనిక్ గణేశ్ మండలి వద్ద ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీపీ పూజలు
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్ గణేశ్ మండలి వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని కలెక్టర్, సీపీ సూచించారు.