News May 21, 2024
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు కలెక్టర్, ఎస్పీ

జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కలెక్టర్ శ్రీకేశ్, ఎస్పీ మలికా గర్గ్‌తో కలిసి నరసరావుపేట జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, రిటర్నింగ్ అధికారి రమణ కాంత్ రెడ్డి, సరోజ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వేగవంతం చేయాలని తెలిపారు. రానున్న 3 రోజుల్లో ప్రోగ్రెస్‌ను మరింతగా పెంచేలా ఈఆర్వోలు పర్యవేక్షించాలన్నారు. డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ నిర్దేశిత మార్గదర్శకాలు పాటిస్తూ 100 శాతం పూర్తి చేయాలన్నారు.
News February 24, 2026
గుంటూరు: ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీ.. నిందితులు వీరే..!

MLA ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. నిందితుల నుంచి 10కేజీల వెండి, 42 సవర్ల బంగారం, రూ.లక్ష నగదు రికవరీ చేశామన్నారు. సత్తెనపల్లి రాకేష్, కొక్కిలిగడ్డ ఆశీర్వాదం దొంగతనానికి పాల్పడ్డారని, వీరిపై గతంలో 34కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 8మంది నిందితులను గుర్తించి, ఐదుగురిని అరెస్ట్ చేసామన్నారు.
News February 24, 2026
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా

గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను నెలవారీ తనిఖీల్లో భాగంగా గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన తాళాల సీల్, సీసీ కెమెరాల డిస్‌ప్లే, ప్రాంగణాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గోడౌన్ భద్రత విషయంలో రాజీ లేకుండా అవసరమైన అన్ని చర్యలు నిరంతరం పటిష్ఠంగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


