News June 5, 2024
ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాం: కలెక్టర్

జిల్లాలో ఓట్లలెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో నిబద్దతతో వ్యవహరిస్తూ.. వారి విధులు సక్రమంగా నిర్వహించారన్నారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 10, 2025
14, 15 తేదీల్లో రైతు సంఘం జిల్లా మహాసభలు

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా, పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో జరగనున్నాయి. ఈ మహాసభకు రైతు సంఘం జిల్లా క్యాడర్ అంతా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆక్వా సంఘం నాయకులు బి. బలరాం తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.
News November 10, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు. ప్రజలు 1100కు కాల్ చేసి కూడా సమస్యలు తెలియజేయవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
News November 9, 2025
తణుకు: బీసీ వసతి గృహంలో కలెక్టర్ తనిఖీలు

తణుకులోని పాత ఊరు బాలికల బీసీ హాస్టల్ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, రుచిగా ఉందా అని ఆరా తీశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


