News June 4, 2024
ఓడినా ప్రజల మధ్యే ఉంటా: నామా

తాను గెలిచినా.. ఓడినా నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్యలోనే ఉంటానని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తనకు కన్న తల్లి ఎంత ఇష్టమో ఖమ్మం నియోజకవర్గ ప్రజలు కూడా అంతే ఇష్టమని చెప్పారు. గెలిస్తే పొంగిపోయేది లేదని ఓడితే కుంగేది లేదన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News January 6, 2026
నేటి నుంచే విద్యుత్ ‘ప్రజా బాట’

విద్యుత్ వినియోగదారుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా బాట’ కార్యక్రమం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మండలాల వారీగా ఈ శిబిరాలు నిర్వహిస్తామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరిస్తారన్నారు.
News January 6, 2026
ఖమ్మం : విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన.. ఉపాధ్యాయుడి తొలగింపు

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నర్సింహులగూడెం పాఠశాలలో పనిచేస్తున్న జి.వీరయ్యను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది అక్టోబరులో ఇతనిపై పోక్సో కేసు నమోదు కావడంతో పాటు సస్పెన్షన్ వేటు పడింది. సమగ్ర విచారణ అనంతరం నివేదిక ఆధారంగా డీఈఓ ఈ బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు.
News January 6, 2026
KTR ఖమ్మం పర్యటన వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

మాజీ మంత్రి KTR రేపు ఖమ్మం రానున్న తరుణంలో ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరి BRSకు ఝలక్ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంతో నగరపాలక సంస్థలో బీఆర్ఎస్ బలం గణనీయంగా తగ్గింది. రానున్న కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా మంత్రి తుమ్మల పావులు కదుపుతుండగా, మరికొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ బాటలో ఉన్నట్లు సమాచారం. కీలక నేత పర్యటనకు ముందే ఈ వలసలు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.


