News June 5, 2024
ఓడిన రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిన ఆమంచి
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిన్న విడుదల కాగా.. రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కానీ కాంగ్రెస్ తరుఫున చీరాల నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు రాష్ట్రంలో అత్యధికంగా 41,295 ఓట్లు పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులకు ఎవరికి కూడా ఇన్ని ఓట్లు పడలేదు. ఆమంచి ఓట్లను చీల్చడం వల్ల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ ఓటమి చవిచూశారు.
Similar News
News December 1, 2024
మాగుంట హత్యకు నేటికి 29 ఏళ్లు..!
ప్రకాశం జిల్లాలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి. నెల్లూరుకు చెందిన ఆయన 1991లో ఒంగోలు MPగా గెలిచారు. మాగుంట ట్రస్ట్‌తో పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయ, కళాశాల నిర్మాణాలు చేపట్టారు. ఆయనను పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) నక్సలైట్లు 1995 డిసెంబర్ 1న హత్య చేశారు. ఆయన సతీమణి పార్వతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. సోదరుడు శ్రీనివాసుల రెడ్డి ప్రస్తుతం ఒంగోలు MPగా ఉన్నారు.
News November 30, 2024
మద్దిపాడులో చిన్నారి మృతి
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు సూర్య ఓ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా గేటు ఊడి బాలుడిపై పడింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన బాలుడు అక్కడే పనిచేస్తున్న వాచ్‌మెన్ మనవడు అని సమాచారం.
News November 30, 2024
బాలినేని తనయుడిపై సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తనయుడు ప్రణీత్ రెడ్డిపై డాక్టర్ యాదాల అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. ‘గత ఎన్నికల ముందు చినగంజాం MPP అంకమరెడ్డి నన్ను ప్రణీత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సంతనూతలపాడు టికెట్ కోసం ఫోన్‌పేలో రూ.10 లక్షలు, క్యాష్‌గా మరో 15 లక్షలు ఇచ్చా. టికెట్ రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరా. కులం పేరుతో నన్ను తిట్టారు’ అని అశోక్ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.