News April 25, 2024

ఓదెల: మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం!

image

ఓదెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని యువతిపై అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మంగళవారం అత్యాచారం చేసినట్లు సమాచారం. యువతి కుటుంబ సభ్యులు పనికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈమేరకు పోత్కపల్లి పోలీసులు వృద్ధుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం

Similar News

News January 14, 2025

పెద్దపల్లి: హాస్టల్‌కు వెళ్లమన్నందుకు ఉరేసుకున్నాడు

image

మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌(M) కూనారం వాసి ప్రసన్నకుమార్ HNKలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తాను హాస్టల్‌కు వెళ్లనని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు మందలించగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News January 14, 2025

KNR: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.

News January 13, 2025

సిరిసిల్ల: జగన్నాథం పార్థివదేహాన్ని సందర్శించిన కేటీఆర్

image

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు మంద జగన్నాథం పార్థివదేహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.